బాగా చదువుతోందని బాలికపై టీచర్‌తో పాటు నలుగురు విద్యార్థులు..

బాగా చదువుతోందని బాలికపై టీచర్‌తో పాటు నలుగురు విద్యార్థులు..

అమ్మాయి అందంగా ఉంటే పాపం.. చాటు మాటుగా గుడ్లప్పింగించి చూసే గుంటనక్కలెన్నో ఉంటాయి. మరి బాగా చదువుకుంటే కూడా కష్టమై పోతే ఎలా. ఆమె కష్టపడి చదువుకుని క్లాసులో ఫస్ట్ వస్తే.. వాళ్లు మరింత కష్టపడాల్సిందిపోయి.. ఆమె మార్కులను చూసి తమ మార్కులను బేరీజు వేసుకుని అవమానంగా భావించారు. అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. ఈ పాపంలో పాఠాలు చెప్పే మాష్టారు కూడా పాలు పంచుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూ ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో బాధిత బాలిక 8వ తరగతి చదువుతోంది. అదే స్కూల్లో బాలిక బంధువుల పిల్లలు నలుగురు చదువుతున్నారు. బాలిక బాగా చదువుకుంటూ క్లాసులో ఫస్ట్ వస్తోంది.

పై క్లాసుల్లో ఉన్న బంధువుల పిల్లలు మాత్రం చదువుపై శ్రద్ధ వహించట్లేదు. దీంతో ఇంట్లోని వారు ఆడపిల్లైనా ఎంత బాగా చదువుకుంటుందో చూడండి. మీరు ఉన్నారు దేనికీ పనికి రారు. చదువు కూడా తిన్నగా చదవరు. ట్యూషన్లు, క్లాసులు అని తిరగడమే తప్పించి చదివేది లేదు అని చీవాట్లు పెట్టారు. దాన్ని అవమానంగా భావించారు ఆ నలుగురు విద్యార్ధులు. అమ్మాయిపై కక్ష పెంచుకున్నారు. లంచ్ బ్రేకులో ఆమెను పిలిచి కలిసి భోజనం చేద్దామన్నారు. వారి ఆంతర్యాన్ని గ్రహించలేని బాలిక వాళ్లు పిలిచిన ప్రదేశానికి వెళ్లింది. స్కూలు సిబ్బంది గదిలోకి పిలిచి మత్తు మందు కలిపిన ఆహారాన్ని ఆమెకు ఇచ్చారు. అది తిన్న బాలిక స్పృహ కోల్పోయింది. దాంతో ఆ నలుగురు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారితో పాటు పాఠాలు చెప్పే పంతులు వారిని వారించాల్సింది పోయి బాలికపై తానూ నీచానికి ఒడిగట్టాడు. ఆమెకు మత్తు వీడి మెలకువ వచ్చిన తరువాత కానీ అర్థం కాలేదు. ఆమెపై అకృత్యానికి పాల్పడిన దృశ్యాలన్నీ తెల్లారేసరికి వాట్సాప్ గ్రూపులో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story