పారామిలటరీ బలగాల్లో 84,000 ఉద్యోగాలు..

పారామిలటరీ బలగాల్లో 84,000 ఉద్యోగాలు..

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, సీఆర్‌పీఎఫ్‌లో 22,980 ఖాళీలు, బీఎస్ఎఫ్‌లో 21,465, సీఐఎస్ఎఫ్‌లో 10,415, ఎస్ఎస్‌బీలో 18,102, ఐటీబపీలో 6643, అస్సాం రైఫిల్స్‌లో 4432 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం సత్వర చర్యలు చేపడుతుందని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా నియామకాలను చేపడుతుంది.

Tags

Next Story