కుప్పంలో చంద్రబాబు పర్యటన

కుప్పంలో చంద్రబాబు పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. తనకు మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు ఈ టూర్ చేపట్టారు. ఇవాళ రామకుప్పం మండలం రాజుపేటలో ఆయన టూర్ ఉంటుంది. నియోజకవర్గ కార్యకర్తలతోనూ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. తర్వాత శాంతిపురంలో బహిరంగ సభలో మాట్లాడతారు. రేపు కుప్పం, గుడుపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.

చంద్రబాబు రాక సందర్భంగా కుప్పం పసుపుమయమైంది. కుప్పం-పూతలపట్టు జాతీయ రహదారితోపాటు పలు గ్రామాల్లో చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. జెండాలు కట్టి అభిమానం చాటుకున్నారు. తీన్‌మార్ డాన్సులతో భారీ ర్యాలీలు తీశారు.

Tags

Next Story