సచివాలయం తరలింపుపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

సచివాలయం తరలింపుపై సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుత సెక్రటేరియట్ ను తొలగించి.. నూతన భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 27న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. దీంతో ఇక్కడి కార్యాలయాలను సాధ్యమైనంత త్వరగా ఇతర భవనాల్లోకి తరలించాలని నిర్ణయించారు. ఆఫీసులను తాత్కాలికంగా ఎక్కడకు మార్చాలి? మొత్తం సచివాలయ భవనాలను ఒకేసారి కూల్చివేయాలా? లేక విడతలవారీగా కూల్చాలా? అన్నదానిపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సిద్ధం చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు..

కొత్త భవనాల నిర్మాణ సమయంలో.. ఇతర బ్లాక్‌లలో కార్యాలయాలు ఉండటం భద్రత కారణాలరీత్యా మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అన్నింటినీ ఒకేసారి తరలించాలని భావిస్తున్నారు.. ఏ శాఖ కార్యాలయాన్ని ఎక్కడికి మార్చాలన్న దానిపై ప్రాథమికంగా కసరత్తు రిగింది. ఇప్పటికే భూర్గుల రామకృష్ణా రావు భవన్, సంక్షేమ భవన్, హజ్ భవన్ లను అధికారులు పరిశీలించారు.

Tags

Next Story