మాయమాటలతో మహిళలను..
మాయమాటలతో మహిళలను మోసం చేసి అశ్లీల వీడియోలు తీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు వాట్సాప్ గ్రూపుల ద్వారా సర్క్యులేట్ అవ్వడంతో బాధిత యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. మొగల్తూరు మండలం పెరుపాలెం నార్త్ గ్రామంలోని లక్ష్మీసాయి సెల్ ఫోన్ షాప్ ఓనర్ అవిశెట్టిసాయిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు.. ఈ కామాంధుడు ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు 61 మందిని వంచించాడు. వారితో ఏకంతంగా గడిపిన దృశ్యాలను తన ఫోన్లో రికార్డు చేశాడు...
సాయి సెల్ ఫోన్ షాపులో పనిచేస్తున్న మరో యువకుడు ఈ వీడియోలను వాట్సప్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలన్నింటినీ సేకరించి మరో వ్యక్తి బాధితుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. బేరం కుదరకపోవడంతో ఆ అశ్లీల వీడియోలను పలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో ఓ బాధిత యువతి మొగల్తూరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు బాధ్యుడైన సాయితోపాటు వీడియో లీక్ చేసిన వ్యక్తి, డబ్బులు డిమాండ్ చేసినవాడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు...వీరి నుంచి అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కామాంధుడి బాధితుల చిట్టా చూసి పోలీసులో ఆశ్చర్యపోయారు..పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com