అంబానీ భార్య ఇక్కడ.. ఆ మాత్రం లేకపోతే ఎలా..

అంబానీ భార్య ఇక్కడ.. ఆ మాత్రం లేకపోతే ఎలా..

మిలియనీర్ భార్య.. మినిమమ్ మెయింటెయిన్ చేయకపోతే ఎలా.. కట్టుకునే చీర దగ్గర్నుంచి వేసుకునే బ్యాగ్ దాకా అన్నీ వెరైటీగా.. అంతకు మించి కాస్ట్లీగా అనిపించాలి. అందుకే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ బ్యాగు వార్తయింది. ఓ మంచి లెదర్ బ్యాగ్ కొనాలంటే వేలల్లో ఉంటుంది. మరి వజ్రాలు పొదిగిన బ్యాగ్ అయితే లక్షలు.. కాదండి.. కోట్లు. అక్షరాలా ఆమె బ్యాగ్ ఖరీదు 2.6 కోట్ల రూపాయలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బ్యాంగు హెర్మస్ హిమాలయ బిర్కిన్ కంపెనీకి చెందినది. మొసలి చర్మంతో తయారు చేసినదని తెలుస్తోంది. అక్కడా, ఇక్కడా చెరువులు, కుంటల్లో ఉండే మొసలి కాదండోయ్.. ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నదిలో జలకాలాడిన మొసలి చర్మంతో తయారు చేసిన బ్యాగ్‌ అని ప్రముఖ వెబ్‌సైట్ల కథనం. 240 వజ్రాలతో డిజైన్ చేసిన ఈ బ్యాగు.. వజ్రాలు దెబ్బతినకుండా.. రాలిపోకుండా ఉండేందుకు 18 క్యారెట్ల బంగారం పెట్టి మరీ అతికించారు. వజ్రాల హ్యాండ్ బ్యాంగ్ పట్టుకున్న నీతూ అంబానీ.. బాలీవుడ్ బ్యూటీస్ కరిష్మా కపూర్, కరీనా కపూర్‌తో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వజ్రం మెరుపుల ముందు తళుకు బెళుకుల తారల అందం వెలవెలపోతోంది.

Tags

Read MoreRead Less
Next Story