అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు 12 మంది అరెస్ట్

అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు 12 మంది అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన కుంభకోణంపై విచారణలో అధికారులు స్పీడ్ పెంచారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు 12 మందిని అరెస్టు చేశారు. 2014 నుంచి స్టాంపుల అమ్మకాల్లో 80 లక్షల వరకు కుంభకోణం జరిగినట్లు తేలింది.

రిజిస్ట్రార్ కార్యాలయంలో విధుల్లో అలసత్వం వహించిన నలుగురిని మొదట సస్పెండ్ చేశారు. ఇప్పుడు మరో 8 మంది అధికారులపై వేటు వేశారు. విచారణ పూర్తైన నేపథ్యంలో మొత్తం 12 మందినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్‌తో పాటు మిగితా సిబ్బంది కూడా ఉన్నారు. ఇంకా ఈ కుంభకోణంలో ఎంకెవరికైనా సంబంధం ఉందా అన్నదానిపై ఆరా తీస్తున్నారు.

2014 నుండి స్టాంపులను విక్రయించిన సిబ్బంది.. ఆ నగదు ప్రభుత్వ ఖాజానాలో జమచేయలేదు. మొత్తం వ్యవహారంలో 78 లక్షలకు పైగా చేతులు మారాయి. విచారణ వేగవంతం చేసిన ఉన్నతాధికారులు.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌లు రెగ్యులర్‌గా లెక్కలు చూడకపోవడం వల్లే ఇంతపెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖాజానాకి గండి పడిందని నిర్ధారించారు.

కుంభకోణంలో ఎవర్నీ వదలబోమన్న ఉన్నతాధికారులు.. కొందరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలను కొట్టిపారేశారు. చిన్న చిన్న మొత్తంలో ఎగ్గొట్టిన వారు.. ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని ఇప్పటికే చెల్లించేశారు. విచారణ పూర్తయిన నేపథ్యంలో 12 మందిని జైలుకు పంపిన ఉన్నతాధికారులు.. 80 లక్షల సొమ్మును కక్కించే పనిలో పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story