సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా

క్రికెట్ లో అరుదుగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలాగే భారత్, బాంగ్లాదేశ్ ల మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్ లో సరికొత్త సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకే కీపర్ లేదంటే ఎక్సట్రా వికెట్ కీపర్ తో బరిలోకి దిగే టీమిండియా ఇవాళ ఏకంగా నలుగురు కీపర్లతో మ్యాచ్ సాగించింది. రెగ్యులర్ కీపర్ ధోనీతో పాటుగా బ్యాట్స్‌మెన్ కోటాలో దినేశ్ కార్తీక్, రిషబ్‌పంత్, కేఎల్ రాహుల్ టీమ్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. వీరు ముగ్గురు కూడా ప్రొఫెషనల్ వికెట్ కీపర్లే. అందరూ టీమిండియాకు కీపర్లుగా ప్రాతినిధ్యం వహించినవారే. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జాదవ్ స్థానంలో…. సీనియర్ దినేష్ కార్తీక్‌కు చోటు లభించింది. అలాగే ధావన్ స్థానంలో రాహుల్ కు అవకాశం లభించింది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో రాహుల్ చెలరేగిపోయాడు. కాగా భారత్ తరఫున ఏకంగా నలుగురు వికెట్ కీపర్లు ఉండటం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ మ్యాచ్ తో భారత జట్టు ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com