క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు

ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు ఆటకు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఇటీవల జరిగిన పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న అంబటి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రపంచప్ కు ఎంపిక అవుతాయని అంతా భావించారు. మంచి ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో రాణించాడు. కానీ చివరి నిమిషంలో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో సెలక్షన్ కమిటీపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. ముఖ్యంగా ఎమ్మెస్కే ప్రసాద్ తో ట్విట్టర్ వార్ జరిగింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రాయుడిని మళ్లీ 16వ సభ్యుడిగా తీసుకున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో ఆయన్ను ఆడిస్తామని బిసిసిఐ ప్రకటించింది.

కానీ అంబటికి ఇప్పటివరకూ పిలుపురాలేదు. ప్రపంచకప్ లో ఆడుతున్న శిఖర్ ధావన్ గాయంతో వైదొలిగాడు.అవకాశం వస్తుందని ఆశించాడు. కానీ రిషబ్ పంత్ ను తీసుకున్నాడు. అనంతరం విజయ్ శంకర్ గాయంతో వైదొలిగితే మాయాంక్ అగర్వాల్ కు అవకాశం ఇచ్చారు. రెండుసార్లు అవకాశం వస్తుందని భావించిన అంబటికి ఛాన్స్ రాలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన అంబటి ఆటకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

1985, సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన అంబటి రాయుడు చిన్ననాటి నుంచి క్రికెట్ పట్ల ఆసక్తి చూపాడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్‌లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మరియు సెంచరీ పూర్తిచేశాడు. 2005-06 సీజన్‌లో ఒకసారి ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున కూడా ఆడినాడు.

2002లో అండర్-19 భారత క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లాండు పర్యటించి అక్కడ మూడవ వన్డేలో 177 పరుగులు సాధించి 305 పరుగుల పక్ష్యఛేధనలో భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. అంతకు క్రితం మ్యాచ్‌లో 80 పరుగులు సాధించి అందులోనూ భారత జట్టు లక్ష్యసాధనకు తోడ్పడ్డాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు. 2015 ఫిబ్రవరి 14 నుండి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఎంపికైన భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే అంబటికి జట్టులో స్థానం దోబూచులాడింది. గట్టి పోటీ ఉండడంతో పాటు.. నిలకడ లేదన్న కారణంగా తరచు జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు.

Tags

Next Story