స్టార్ హీరోయిన్ భర్త అరెస్ట్!

స్టార్ హీరోయిన్ భర్త అరెస్ట్!

అలనాటి బాలీవుడ్ ముద్దుగమ్ము భాగ్యశ్రీ.. భర్త హిమాలయ అంబోలీని .. దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపారవేత్త అయిన హిమాలయను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచీకత్తుతో బెయిల్ మీద విడుదలచేశారు. భాగ్యశ్రీ ఒకప్పుడు బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన కథానాయిక. బాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు నాంది పలికిన ‘మైనే ప్యార్ కియా' చిత్రంలో నటించి బాగా పాపులయ్యారు ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమపావురాలు’గా డబ్ చేశారు. తెలుగు లో కూడా ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించింది. భాగ్యశ్రీ.. హిమాలయను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ఆమెకు ఇద్దరు సంతానం. కుమారుడు అభిమన్యు దాసాని ‘మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోతా’అనే సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు.. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రిలీజ్‌ అయింది.

Tags

Read MoreRead Less
Next Story