ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు సీఎం, స్పీకర్ క్లాస్
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు రెండు రోజులపాటు అసెంబ్లీ నిబంధనలపైన, ప్రవర్థానా నియమావళిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ తరగతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అసెంబ్లీ నిర్వహణ తీరు, గౌరవ సభ్యులు ఎలా ప్రవర్థించాలి, తమ ప్రసంగంలో ఎలాంటి అన్ పార్లమెంటరీ పదాలను ఉశ్ఛరించరాదు అన్న అంశాలన్నింటిపైన శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంకు అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎలా వినియోగించుకోవాలో విశదీకరించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో సుమారు 70 మంది దాకా కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. 175 మంది సభ్యులు కల అసెంబ్లీలో అత్యధిక శాతం కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. వీరికి అసెంబ్లీ విధి విధానాలు, ప్రవర్థనా నియమావళిపై రెండు రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు. అసెంబ్లీలోని మీటింగ్ హాల్ లో ఈ తరగతులను నిర్వహిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com