గోల్ కొడుతున్న గోమాత.. వీడియో వైరల్..

ఆవు ఫుట్బాల్ ఆడుతోంది. అదీ మామూలుగా కాదు.. రెగ్యులర్ ఆటగాళ్లతో పోటీపడి మరీ. నమ్మడం లేదా.. నిజంగా నిజం. గోవాలో ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్లోకి వచ్చిన ఆవు అక్కడి ఆటగాళ్లతో పోటీపడి బంతిని తన కాళ్ల దగ్గరే పెట్టుకుంది. చుట్టూ ఎవరు రాకుండా చూస్తూ డిఫెన్స్ చేసింది. కాలితో బంతిని తన్నేందుకు రెడీ, రండి చూసుకుందాం అన్నట్టుగా ఫోజులిచ్చింది. మధ్యలో బంతి కుర్రాళ్ల వద్దకు వెళ్లినా, వాళ్ల వెంటపడి మరీ తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకుంది.
దాదాపు 2 నిమిషాలు ఉన్న ఆవు ఫుట్బాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది క్రిస్టియానో రొనాల్ 'కౌ' అని సరదాగా ట్వీట్ చేశారు హర్షా భోగ్లే. ఈయనే కాదు చాలా మంది సెలబ్రిటీలు ట్వీట్లు, రీట్వీట్లతో ఇప్పుడీ వీడియో హల్చల్ చేస్తోంది. అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com