సెమీస్‌లో చోటు దక్కించుకున్న భారత్

సెమీస్‌లో చోటు దక్కించుకున్న భారత్

వరల్డ్‌కప్‌లో భారత్ సెమీస్ చేరింది. బంగ్లాపై 28 పరుగుల విజయం సాధించిందితో ఫైనల్ పోరులో చేరిన రెండో జట్టుగా నిలిచింది. రోహిత్ సూపర్ సెంచరీతో భారీ స్కోరు సాధించిన భారత్ కు చేజింగ్ లో టెన్షన్ పుట్టించింది బంగ్లా. కానీ బుమ్రా ధాటికి బంగ్లా ఆటగాళ్ల గర్జన 48 ఓవర్లకే ముగిసింది. ఈ విజయంతో వాల్డ్ కప్ లో వరుసగా మూడోసారి సెమీస్ లో చోటు దక్కించుకుంది మెన్ ఇన్ బ్లూ.

ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో తడబడిన భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్ తో మళ్లీ గాడిలో పడింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా బంగ్లాదేశ్ ను మట్టి కరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ రికార్డ్ పార్ట్ నర్ షిప్ తో శుభారంభాన్ని అందించింది. రోహిత్ శర్మ 92 బాల్స్ లో 104 పరుగులు చేసి ఈ ప్రపంచ కప్ లో నాలుగో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఓకే ప్రపంచ కప్ లో నాలుగు సెంచరీలు చేసి రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఓవైపు రోహిత్ చెలరేగిపోగా..మరో ఎండ్ లో రాహుల్ స్టడీగా ఆడుతూ వికెట్ స్టాండింగ్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్ కు 180 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఓపెనర్లు. భారత్ కు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం.

ఆ తర్వాత వచ్చిన వారిలో రిషబ్ పంత్ ధాటిగా ఆడటంతో టీమిండియా స్కోరును పెంచింది. రిషబ్ 41 బాల్స్ ఆడి 48 పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. జట్టు స్కోరు ఇంకా పెరిగే అవకాశలు ఉన్నా..స్లాగ్ ఓవర్స్ లో బంగ్లా బౌలర్లు కట్టడి చేయటంతో స్కోరు అంచనాలు చేరుకోలేకపోయింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 5 వికెట్లు పడగొట్టాడు. 315 పరుగులు బిగ్ టార్గెట్ తో చేజింగ్ మొదలు పెట్టిన బంగ్లాకు పదో ఓవర్లోనే షాక్ తగిలింది. షబీ తమీమ్ ఇక్బాల్ వికెట్ పడగొట్టాడు. అయితే..తర్వాత వచ్చిన షకీబ్ ఉల్ హసన్ తో పాటు చివర్లో షబ్బీర్‌-సైపుద్దీన్‌ జోడీ భారత్ కు కంగారు పుట్టించింది. వికెట్లు పడుతున్నా బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ దూకుడుతో ఫ్యాన్స్ లో టెన్షన్ పుట్టించింది. రన్ రేట్ ఎక్కువగానే ఉన్నా ఎదో మూల బంగ్లా వైపు మ్యాచ్ టర్న్ అవుతున్నట్లు కనిపించింది. అయితే.. కీలక సమయంలో బుమ్రా, చాహాల్ వికెట్లు తీయటంతో బంగ్లాదేశ్ పోరు మధ్యలోనే ముగిసింది. 66 పరుగులతో షకీబ్ ఉల్ హసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఈ విక్టరీతో ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ కు చేరింది భారత్. వాల్డ్ కప్ లలో సెమీస్ కు చేరుకోవటం భారత్ కు ఇది మూడో సారి. ఇక ప్రస్తుత ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా తర్వాత సెమీస్ లో చోటు దక్కించుకున్న రెండో జట్టుకు గా నిలిచింది కోహ్లీ సేన. ఈ మ్యాచ్ ఓటమితో బంగ్లాదేశ్ కు సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతైనట్లే. ఇక పాకిస్తాన్ సెమీస్ ఆశలు మరింత పదిలంగా మారాయి.

Tags

Next Story