కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ వోరా

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ వోరా

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతిలాల్ వోరా నియమితులయ్యారు. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి అధ్యక్షుడి ఎంపిక పూర్తి అయ్యేవరకు మోతిలాల్ వోరా ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కాగా బుధవారం మాట్లాడిన రాహుల్. ‘పార్టీ(కాంగ్రెస్‌) ఇక ఆలస్యం చేయకుండా కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రక్రియలో నేను పాలుపంచుకోను. ఎందుకంటే నేను ఇప్పటికే ఆ పదవికి రాజీనామా చేశా. ఇప్పుడు నేను పార్టీ అధ్యక్షుడిని కాదు. కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ త్వరలోనే సమావేశమైన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి’ అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story