క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త..

క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త..

క్రికెట్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చేందుకు ధోనీ సిద్ధమయ్యాడా..? ఈ వరల్డ్‌ కప్‌ తరువాత రిటైర్మెంట్‌ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడా..? వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఆడే చివరి మ్యాచ్‌ ధోనీకి ఆఖరి వన్డే కానుందా...? జాతీయ మీడియా కథనాలు అవుననే అంటున్నాయి. మాజీ కెప్టెన్‌ ధోని రిటైర్మెంట్‌కు సిద్ధపడ్డాడని సమాచారం అందుతోంది. ఇప్పటికే సమాచారాన్ని బీసీసీఐ అధికారులకు చెప్పాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా ఆడే చివరి మ్యాచ్‌ తరువాత రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని బీసీసీఐలో తన సన్నిహితులకు సమాచారం అందించాడని తెలుస్తోంది..

ప్రస్తుతం వరల్డ్‌ కప్‌లో పేలవమైన ఆటతీరుతో ధోని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ధోనీకి ధనాధన్‌ క్రికెటర్‌ అని పేరుంది. కాని గతం కొంత కాలంగా అతడిలో ఆ దూకుడు కనిపించడం లేదు. ముఖ్యంగా వరల్డ్‌ కప్‌లో ధోనీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. ధోని నుండి భారీ ఇన్నింగ్సులను ఆశిస్తున్న అభిమానులు అతడి ఆటతీరు విసుగు తెప్పిస్తోంది. వరుసగా ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో మరీ జిడ్డుగా ఆడడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇంగ్లండ్‌తో గెలిచే అవకాశం ఉన్నా.. స్లోగా ఆడడని విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 350 పైగా పరుగులు చేసే అవకాశం ఉన్నా.. ధోనీ నెమ్మదిగా ఆడడంతో స్కోరు తగ్గిందని.. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతోంది..

టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం ధోని ఆటతీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికు మాస్టర్ బ్లాస్టర్ సచిన్, మాజీ కెప్టెన్ గంగూలీ, సంసయ్ మంజ్రేకర్ లు ధోని స్లో బ్యాటింగ్ పై బహిరంగంగానే విమర్శలు చేశారు. కీపింగ్ మునుపటి ఫాం లేదని మండిపడుతున్నారు. డిఆర్ఎస్‌ సమీక్షల విషయంలోనూ గతంలోలా ధోనీ నిర్ణయాలు సరిగ్గా రావడం లేదని.. విమర్శలు అధికమయ్యాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే ధోని క్రికెట్ కుగుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story