రోహిత్‌ కొట్టిన సిక్సర్‌ బంతి మహిళా అభిమానికి తగలడంతో..

రోహిత్‌ కొట్టిన సిక్సర్‌ బంతి మహిళా అభిమానికి తగలడంతో..

ఇండియన్ స్టార్ బాట్స్‌మెన్ రోహిత్‌ శర్మ ఓ అభిమానిని సర్‌ప్రైజ్‌ చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం టీమిండియా-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆ అభిమానికి సర్‌ప్రైజ్‌ గిప్ట్ ఇచ్చాడు. గ్రౌండ్ నలుమూలల బౌండరీలు,సిక్సర్‌లతో మోత మెగించిన రోహిత్‌ సెంచరీతో అదరగొట్టాడు. అయితే ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రోహిత్ బాదిన ఓ సిక్సర్‌ బంతి ఓ మహిళా అభిమానికి తగిలింది. ఈ విషయాన్ని గమనించిన రోహిత్‌ 104 పరుగులు చేసి పెవిలియన్‌ చేరిన తర్వాత ఆ అభిమాని గురించి అరా తీశారు. మైదానం నుంచి వెళ్లేటప్పుడు అక్కడున్న అభిమానిని చూసిన రోహిత్ మ్యాచ్‌ తర్వాత ఆమెను పిలిపించి, మాట్లాడి ఆమె హ్యాట్‌పై సంతకం చేసి ఇచ్చాడు. తర్వాత ఆమెతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో ఖాతలో ఫోస్ట్ చేసింది. ఇప్పుడు ఇవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు రోహిత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో తప్పక బంగ్లా ఓటిమిని చవిచూసింది. మెుదటిగా బ్యాటింగ్ చేసిన 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేయగా... బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు రోహిత్‌ నాలుగు శతకాలు చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story