టీచర్ల సస్పెన్షన్ వ్యవహారంలో మరో మలుపు!

టీచర్ల సస్పెన్షన్ వ్యవహారంలో మరో మలుపు!

మహాబూబ్ నగర్ లో టీచర్ల సస్పెన్షన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆలస్యంగా వచ్చారంటూ జిల్లా కలెక్టర్ ఒకే సారి 9 మంది టీచర్లపై చర్యలు తీసుకోవటం సంచలనంగా మారింది. అయితే.. టీచర్లు మాత్రం సరైన సమయానికే వచ్చామని అంటున్నారు. కలెక్టరే ముందు వచ్చారని సస్పెన్షన్ నోటీస్ తీసుకోవటానికి కూడా నిరాకరిస్తున్నారు.

ప్రభుత్వ టీచర్లు అంటే బడి అభివృద్ధి కన్నా సొంత బిజినెస్ పైనే ఎక్కువ దృష్టి పెడతారనే ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. పిల్లలకు చదువు చెప్పటం కన్నా చిట్టీలు, ఫైనాన్స్ , రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిజీగా ఉంటారనేది బహిరంగ రహస్యం. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. టీచర్ల హజరుతో పాటు సరైన సమయంలో అటెండెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ ప్రారంభం కావటంతో గత నెల 29న కలెక్టర్ రోనాల్డ్ రాస్ మహబూబ్‌నగర్‌లోని మార్కెట్‌రోడ్ హైస్కూల్‌లో తనిఖీలు చేపట్టారు.

మహబూబ్‌నగర్‌లోని మార్కెట్‌రోడ్ హైస్కూల్‌లో మొత్తం 16 మంది టీచర్లు ఉన్నారు. గత నెల 29న 9న ముగ్గురు సెలవు పెట్టారు. మిగతా 13 మందిలో కేవలం నలుగురు మాత్రమే ప్రార్థన సమయానికి వచ్చారు. హెడ్‌మాస్టర్‌ సహా మిగతా 9 మంది టైమ్‌కు రాలేదు. దీంతో.. వాళ్లందరినీ సస్పెండ్‌ చేయాలంటూ డీఈఓను ఆదేశించారు కలెక్టర్‌ రోనాల్డ్ రాస్.

సస్పెన్షన్ కు సంబంధించి ఉత్తర్వ్యులు మంగళవారం విడుదల అయ్యాయి. అయితే..హై స్కూల్ టీచర్ల వాదనలో మరోలా ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 9న్నర గంటలకు పాఠశాల మొదలవుతుందని.. తాము ఆ టైమ్‌లోపే స్కూల్‌కు వచ్చామని అంటున్నారు. అయితే.. కలెక్టర్ రోనాల్డ్ రాస్‌ 9 గంటలకే పాఠశాలకు వచ్చి తనిఖీలు చేశారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. డీఈఓ నుంచి వచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులను తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో.. చేసేది లేక విద్యాశాఖ సిబ్బంది పాఠశాల గోడకు వాటిని అంటించారు.

Tags

Read MoreRead Less
Next Story