ఇంటర్ అర్హతతో టీటీ హబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా.. జులై 4న

ఇంటర్ అర్హతతో టీటీ హబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా.. జులై 4న

HRH నెక్టస్ సంస్థలో 400 కన్య్జూమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళాను నిర్వహించనున్నారు. టీటీ హబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు హబ్ ప్రతినిధి విశాల్ వెల్లడించారు. జులై 4వ తేదీన దోమల్ గూడలోని ఏవీ కాలేజీలో మేళా ఉంటుందని తెలియజేశారు. అభ్యర్థులు ఇంటర్ పాసై ఉండాలి. యవసు 19 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు. చదువుకునే విద్యార్థులకు పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అర్హతలను బట్టి రూ.18వేల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు ఫోటో, బయోడేటా, ఆధార్, పాన్‌కార్డు తీసుకుని వెళ్లాలి. ఎంపికైన వారికి అక్కడే జాయినింగ్ ఆర్డర్ పత్రాలు ఇస్తారు. మరిన్ని వివరాల కోసం 8688721055,8688729671 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story