ఇలాంటి పనులు చేస్తే అస్సలు సహించను...

ఇలాంటి పనులు చేస్తే అస్సలు సహించను...
X

భాజపా ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌ వర్గియాలతో కలిసి మున్సిపల్‌ అధికారిపై దాడి చేసిన ఘటనపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే వారిని సహించేది లేదన్నారు. మంగళవారం జరిగిన పార్లమెంటరీ భేటీలో ఈ దాడి ఘటనను ప్రస్తావించారు. ఇలాంటి పనులు చేసేవారు లేదని గట్టి హెచ్చరికలు చేసినట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి.

' పార్టీలో బంధు ప్రీతి ఉండకూడదు. ఎవరి కుమారుడైనా,బంధువైనా సరే తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. పార్టీని దెబ్బతీసే నేతలు మనకొద్దు. పార్టీలో అందరూ సమానమే. ఎంత పెద్ద నేతలకైన మినహాయింపు ఉండదు. పార్టీ పేరుతో దురుసుగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు’ అంటూ ప్రధాని ఎంపీలకు చేప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌ తన అనుచరులతో కలిసి మున్సిపల్‌ అధికారులపై క్రికెట్‌ బ్యాట్‌తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. భాజపా జనరల్‌ సెక్రటరీ కైలాశ్‌ విజయ్‌ వర్గియా కుమారుడే ఆకాశ్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌-3 నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు ఆకాశ్‌.. ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆకాశ్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన మోదీ.. ఆకాశ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసేవారిని సహించేది లేదంటూ నేతలకు హెచ్చకలు జారీ చేశారు.

Tags

Next Story