'బిగ్‌బాస్ 3' లోకి సతీసమేతంగా హీరో!!

బిగ్‌బాస్ 3 లోకి సతీసమేతంగా హీరో!!

విజయవంతంగా రెండు సీజన్లు ముగించుకుని మూడవ సీజన్‌లోకి అడుగుపెడుతున్న బిగ్‌బాస్.. హౌస్‌లోకి ఎవర్ని తీసుకురావాలనేదాని మీద పెద్ద కసరత్తే ప్రారంభించింది. తెరపై రోజుకో పేరు వినిపిస్తున్నా.. ఫైనల్‌గా ఎవరనేది చివరి వరకు సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తోంది స్టార్ మా. మొన్నటి వరకు హోస్ట్ ఎవరనే దాని మీద చర్చలు నడిచాయి. ప్రోమోతో నవమన్మధుడు నాగార్జున అని కన్ఫామ్ అయింది. నవ్వించి, కవ్వించే నాగార్జున వస్తే ఇంటి సభ్యులకు బోల్డంత టైమ్‌పాస్. ఇక ఇంటి సభ్యులు.. హేమచంద్ర, ఉప్పల్ బాలు, ఉదయభాను, శ్రీముఖి, తీన్మార్ సావిత్రి ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు తాజాగా తెరపైకి వచ్చిన జోడీ.. భార్యా భర్తలు అయిన హీరో వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షెరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే బిగ్ బాస్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని అంటున్నారు.

సాధారణంగా హౌస్‌లోకి ఎంటరయ్యే సభ్యులకు ఒకరి గురించి ఒకరికి అంతగా తెలియదు. అందుకే చాడీలు, అలకలు, గొడవలు.. నానా హంగామా చేస్తూ ప్రేక్షకులు హౌస్ గురించి, ఇంటి సభ్యుల గురించి మాట్లాడుకునేలా చేస్తుంటారు. ఒక్కోసారి విసుగుతెప్పించినా, మొత్తానికి హౌస్ వినోదాన్ని పంచేదిగా ఉంటుంది. ఇలాంటి ఇంట్లోకి భార్యభర్తలు అడుగుపెడితే ఎలా ఉంటుందో అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. హ్యాపీడేస్‌తో పరిచయమైన వరుణ్ సందేశ్.. దాదాపు 20 సినిమాల్లో చేశారు. ఈ మధ్య సినిమాలకు కాస్త దూరమైన వరుణ్ నువ్వు తోపురా సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2015లో వితిక షెరును వివాహం చేసుకున్న వరుణ్ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరవుతున్నట్లు వార్తల సారాంశం. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story