అర్థరాత్రి ఇంటికి వెళ్తున్న నర్సుపై..

అర్థరాత్రి ఇంటికి వెళ్తున్న నర్సుపై..

విశాఖలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. యువతిపై గుర్తుతెలియని దుండగులు హత్యయత్నానికి పాల్పడ్డారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆ యువతిపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు దుండగులు . మంటలతో యువతి రోడ్డుపై కేకలు వేస్తూ పరిగెత్తింది. ఆమె ఆరుపులతో దుండగులు పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి యువతిని కేజీహెచ్‌కు తరలించారు.

యువతి పరిస్థితి విషమంగా ఉంది. 60శాతం పైగా శరీరం కాలినట్లు కేజీహెచ్‌ వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు భోగపురపు కావ్యగా గుర్తించారు. యువతి ప్రయివేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది.

Tags

Next Story