వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి పని మనిషి రంగయ్యతో పాటు..
దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సిట్ బృందం వేగం పెంచింది. సీఎం జగన్ ఆదేశాలతో కేసును నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యారు సిట్ అధికారులు. ఆధారాల సేకరణలో వరసగా అనుమానితులను, సాక్ష్యులను విచారిస్తున్నారు. అందులో భాగంగా నిన్న వివేకానంద రెడ్డి ఇంటి పని మనిషి రంగయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు..మరోసారి ఇంటి పనిమనిషిని విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు.
నార్కో అనాలసిస్ లైవ్ డిటెక్టర్ పరీక్షలు జరిపేందుకు హైద్రాబాద్కు తరలించారు. ఇవాళ వివేకానందరెడ్డి ఇంటి పని మనిషి రంగయ్యతో పాటు..మాజీ డ్రైవర్ దస్తగిరిని,,కొంతమంది ముస్లింలను కూడా విచారించినట్టు తెలుస్తుంది. వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగు నెలలు కావస్తున్నా..ఇప్పటికే కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇటీవలే ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com