ఇంటర్ అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. అమ్మాయిలకు మాత్రమే అవకాశం.. జీతం రూ. 36,630

ఇంటర్ అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. అమ్మాయిలకు మాత్రమే అవకాశం.. జీతం రూ. 36,630

ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలు పెళ్లికాని యువతులకు మాత్రమే. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జులై 9న నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు 51.. www.airindiaexpress.in వెబ్‌సైట్‌లె దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫూర్తిచేసిన ఫామ్‌కి కావలసిన డాక్యుమెంట్స్ జతపరచాలి. రూ.500 డీడీ తీసుకోవాలి. మెడికల్ ఎగ్జామినేషన్, గతంలో పనిచేసిన కంపెనీలకు సంబంధించిన రిఫరెన్సుల ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ప్రీ-ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్‌కు రూ. 2 వేల నుంచి 3వేల మధ్య ఖర్చవుతుంది. ఇంకా ఐవేనా పరీక్షలు ఉంటే వాటి ఖ్రర్చులు అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన వారికి శిక్షణ సమయంలో నెలకు రూ.10,000 స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ అనంతరం అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకుంటారు. అప్పుడు నెలకు రూ.36,630 వేతనం పొందవచ్చు.

అర్హత: ఇంటర్ లేదా 12వ తరగతి పాసై ఉండాలి. అనుభవం: B737 NG/MAX విమానాల్లో క్యాబిన్ క్రూ ఉద్యోగంలో కనీసం ఏడాది పని చేసి ఉండాలి. వయసు: 2019 జులై 1 నాటికి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ కేటగిరీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. ఎత్తు: 157.5 సెంటీమీటర్లు ఉండాలి. ఇంటర్వ్యూ సమయం: జులై 9 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: Th Gateway Hotel, Calicut, Pt Usha road, Calicut, Pin-673032.

Tags

Read MoreRead Less
Next Story