గుడ్‌న్యూస్.. ఇకపై మీ భాషలోనే బ్యాంకు పరీక్ష..

ఇంగ్లీష్ రాదు.. హిందీ అర్థం కాదు.. బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేద్దామంటే పరీక్షా పత్రం హిందీ, ఇంగ్లీషుల్లో ఉంటుందని చింతించాల్సిన అవసరం లేదు. ఇకపై బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. బ్యాంకు పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే బ్యాంకు పరీక్షలు రాసే అవకాశం ఉంది. దీని వలన ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారికి పరీక్ష రాయడం కష్టంగా మారిందని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఇంగ్లీషు భాషపై పట్టు తక్కువగా ఉండడంతో ప్రశ్నా పత్రం సరిగా అర్థం కాక కొందరు అభ్యర్థులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన వారికి మరింత ఇబ్బంది. తాజా నిర్ణయంతో ఈ అభ్యర్థులకు మేలు జరుగుతుంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com