తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షణకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షణకోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది ఆ పార్టీ. వైసీపీ నేతల నుంచి బెదిరింపులు, దాడులు జరిగితే టీడీపీ కార్యకర్తలు 73062- 99999 నెంబర్‌కి ఫోన్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వేధించినా సరే.. ఈ నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు లోకేష్. ఈ దాడుల్లో గాయపడిన,చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భరోసా యాత్ర చేపట్టనున్నారు తెలిపారు.. టీడీపీ కార్యకర్తలకు న్యాయపరమైన, చట్టపరమైన సాయం అందిస్తామని చెప్పారు లోకేష్ . టీడీపీ కార్యకర్తల రక్షణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ ఎన్ని దాడులు చేసినా.. టీడీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని లోకేష్ సూచించారు.
RELATED STORIES
Vijay Varma : మా అమ్మ నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారంది : విజయ్ వర్మ
11 Aug 2022 2:01 PM GMTAllu Arjun Brands : ఒక యాడ్‌కు అల్లు అర్జున్ ఎంత తీసుకుంటారో మీకు...
11 Aug 2022 12:22 PM GMTVishal : విశాల్‌కు తీవ్ర గాయాలు.. ఆందోళనలో అభిమానులు..
11 Aug 2022 11:15 AM GMTVV Vinayak: బాలయ్యకు చెల్లెలిగా చేయమంటే ఏడ్చేసిన నటి..
11 Aug 2022 11:00 AM GMTAarya Ghare : స్మశానంలో బర్త్‌డే పార్టీ చేసుకున్న నటి..
11 Aug 2022 9:31 AM GMTTabu: షూటింగ్లో ప్రమాదం.. టబు కంటిపై గాయం..
11 Aug 2022 8:17 AM GMT