అంతర్జాతీయం

ఎయిర్‌పోర్టులో కాల్పుల మోత.. బెదిరిపోయిన ప్రయాణికులు

ఎయిర్‌పోర్టులో కాల్పుల మోత.. బెదిరిపోయిన ప్రయాణికులు
X

లాహోర్ ఎయిర్‌పోర్టు కాల్పుల మోతతో దద్దరిల్లింది. లాహోర్‌లో ఉన్న అల్లామా ఇక్బాల్ ఇంటర్నేష నల్ ఎయిర్‌పోర్టులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొ కరు గాయపడ్డారు. మక్కా నుంచి వచ్చిన ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ లాంజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. ఒక్కసారిగా తుపాకీ గర్జించడంతో ప్రయాణికులంతా బెదిరిపోయారు.

దుండగుడి కాల్పులతో లాహోర్ ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది, కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు ఓ టాక్సీ ద్వారా విమానాశ్రయానికి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనక ఉగ్రకోణం లేదని, వ్యక్తిగత కోపంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటా డని పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Next Story

RELATED STORIES