బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌పై హైదరాబాద్‌ KPHB కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కల్ట్‌ ఫిట్‌నెట్‌ సెంటర్‌కు హృతిక్‌ రోషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. దీనికి ముకేష్‌ బాంచల్‌ డైరెక్టర్‌, అంకిత్‌ సీఈవో, సుబ్రమణ్యం మేనేజర్‌. బరువు తగ్గడానికి ఏడాదికి 17వేల రూపాయల నుంచి 36 వేల వరకు ప్యాకేజీలు ప్రకటించారు. దీనికి హృతిక్‌రోషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడంతో చాలా మంది సభ్యత్వం తీసుకున్నారు.

పరిమితికి మించి అభ్యర్థులు నమోదు చేసుకోవడంతో వారికి కేటాయించిన టైమ్‌ స్లాట్‌ బుక్‌ కావడం లేదు. డబ్బులు చెల్లించిన అనేక మంది నిత్యం సిబ్బందిని స్లాట్‌ కోసం నిలదీసినా రెస్పాన్స్ కావడంలేదు. దీంతో విసుగు చెందిన శశికాంత్‌ అనే బాధితుడు KPHB కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిమితికి మించి దరఖాస్తులు స్వీకరించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఎండీ, సీఈవో, మేనేజర్‌లతో పాటు సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ హృతిక్‌రోషన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లయింట్‌ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిపై 420, 406 సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story