40 మందిని బలి తీసుకున్న వైమానిక దాడులు

లిబియాలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. వైమానిక దాడులతో 40 మందిని బలి తీసుకున్నారు. ట్రిపోలి నగర శివారులో ఉన్న తజౌరాలోని వలసదారు ల పునరా వాస కేంద్రంపై బాంబుల వర్షం కురిసింది. ఆ సమయంలో అక్క దాదాపు 120 మంది ఉన్నారు. ఈ దాడిలో 40 మంది అక్కడికక్కడే మృతి చెందగా 80 మంది గాయపడ్డారు. మృతుల్లో చాలా మందిని అఫ్రికా వలస దారులుగా గుర్తించారు. దాడి తీవ్రత భారీగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లిబియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
లిబియన్ నేషనల్ ఆర్మీ, ఈ వైమానిక దాడులకు పాల్పడినట్లు అనుమాని స్తున్నారు. ఈ సంస్థ, ట్రిపోలి తూర్పు భాగాన్ని అధీనంలోకి తీసుకొని పరిపా లిస్తోంది. 2011లో లిబియాలో గడాఫీని హతమార్చిన నాటి నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ప్రభుత్వ వ్యతిరేక వర్గం LNAగా ఏర్పడి తరచూ హింసకు పాల్పడుతోంది. అధికారిక ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం సాగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com