వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు : నారా లోకేష్
ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు నారా లోకేష్. ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చెయద్దన్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతుల సందర్భంగా చంద్రబాబుగారిపై యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన దానిని వక్రీకరిస్తూ..నాకు అబద్దాలు చెప్పడం అలవాటే అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు చెప్పారంటూ జగన్ పై ఫైరయ్యారు లోకేష్.
చంద్రబాబుగారిమీద జోకులు వేయబోయి.. మీ తండ్రిగారైన వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని మరొక్కసారి ప్రజలకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు అన్నారు లోకేష్ . జగన్ అనాటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ఓసారి చదువుకొని వస్తే బాగుండేదన్నారు. వైఎస్ హయాంలో ధనయజ్ఞం జరుగుతున్న రోజుల్లో మీరు సెటిల్ మెంట్లతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇచ్చంపల్లి, ఎల్లంపల్లిలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం లేదంటూ జగన్ పై సెటైర్లు వేశారు లోకేష్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com