దిద్దేకుంట చంద్రశేఖర్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్ట్..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత నాలుగు నెలలుగా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాల్‌డేటా ఆధారంగా సుమారు 380 మందిని విచారించినా.. హ్య వెనక దాగిఉన్న కుట్రను చేధించలేకపోయారు. అయితే ఇటీవల కొత్తగా ఏర్పడిన సిట్... మరో కోణంలో కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వాచ్‌మెన్ రంగయ్యకు నార్కో అనాలసిస్ చేసేందుకు బుధవారం కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా మరో నిందితుడు దిద్దేకుంట చంద్రశేఖర్ రెడ్డికి కూడా నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే తరహాలో మరికొంత మందికి కూడా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరాలని సిట్ భావిస్తోంది. కోర్టు అనుమతి లభించిన వెంటనే వీరందరినీ హైదరాబాద్‌కు తరలించి.. నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com