కాంగ్రెస్‌కు కొత్త బాస్.. రాహుల్ స్థానంలో..?
కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. వారం రోజుల్లో కొత్త నాయకున్ని నియమిం చాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త బాస్‌గా ఎవరు వస్తారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. విశ్వ సనీయవర్గాల సమాచారం మేరకు ఇద్దరు నాయకుల పేర్లను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీని యర్ నాయకులు సుశీల్ కుమార్ షిండే, మల్లికార్జున ఖర్గేలు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఐతే వీరిద్దరిలో ఎవరికి పట్టం కట్టాలనే నిర్ణయాన్ని మాత్రం గాంధీ కుటుంబమే తీసుకోనుంది. అధ్యక్షుడి ఎంపికలో తన జోక్యం ఉండబోదని రాహుల్ చెప్పినప్పటికీ, కొత్త బాస్ ఎంపికను సోనియా-రాహుల్-ప్రియాంక త్రయం ఖరారు చేయనుంది. ఈ లెక్కన పార్టీ అధ్యక్షునిగా వేరేవాళ్లు వచ్చినప్పటికీ, తెరవెనక పెత్తనం మాత్రం గాంధీ కుటుంబానిదే.
సుశీల్ కుమార్ షిండే విషయానికి వస్తే, 77 ఏళ్ల షిండేకు అపార రాజకీయ అనుభవం ఉంది. ఈ మరాఠా నాయకుడు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేశారు. 2002లో పార్టీ తరఫున ఉపరాష్ట్రపతి పదవికి కూడా పోటీ పడ్డారు. దళిత నాయకునిగా పేరొందిన షిండే, కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి సన్నిహి తునిగా పేరు పొందారు. సోనియా కుటుంబానికి కూడా షిండేపై గౌరవం ఉంది. పైగా, ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను షిండేకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
మల్లికార్జున ఖర్గే విషయానికి వస్తే, 76 ఏళ్ల ఖర్గే కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా పని చేశారు. గత లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు. విపక్షాలను కూడగట్టి లోక్‌సభలో మోదీ సర్కార్‌ను పలు సందర్భాల్లో ఇరుకునపెట్టారు. కర్ణాటకకు చెందిన ఖర్గేకు రాజకీయంగా అపారమైన అను భవం ఉంది. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు కలిగి ఉన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయునిగానే పేరు పొందారు. కీలక సందర్భాల్లో సోనియా గాంధీ మాట జవ దాటకుండా పని చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గేకు కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు.
ఇదిలా ఉంటే, సోనియా కుటుంబం ఇంకో ప్లాన్‌లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ స్థానంలో ప్రియాంకా వాద్రాను కూర్చోబెట్టాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రియాంకను పార్టీ నాయకురాలిగా చేసి, రాహుల్‌తో దేశవ్యాప్తంగా పర్యటన జరిపించాలన్నది సోనియా ఆలోచనగా చెబుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక విఫలమైనప్పటికీ, పార్టీ శ్రేణుల్లోనూ-ప్రజల్లోనూ ఆమెకు ఇప్పటికీ క్రేజ్ ఉందని సోనియా నమ్ముతున్నారు. ప్రియాంకను మరింత బలంగా ఫోకస్ చేస్తే, అది పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని విశ్వసిస్తున్నారు. షిండే, ఖర్గేలలో ఒకరికి అవకాశం ఇస్తే, అది సంచలనమే అవుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com