'బేబీ ఆన్ స్టెరాయిడ్స్'.. సమంత స్పందన

బేబీ ఆన్ స్టెరాయిడ్స్.. సమంత స్పందన

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లా కండలు పెంచిన కటౌట్‌ని సమంత అభిమానులు ఏర్పాటు చేశారు. ఓ బేబీ సినిమా శుక్రవారం (జులై 5న) రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. నగరంలో ఎక్కడ చూసినా బేబీ దర్శనమిస్తోంది. కొరియాలో హిట్ అయిన మిస్ గ్రానీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మలిచారు దర్శకురాలు నందినీ రెడ్డి. అయితే కండలతో ఉన్న సమంత కటౌట్‌ని చూసిన ఓ అభిమాని.. మేడమ్ ఈ కటౌట్‌ను నా స్నేహితుడు పెట్టిన జిమ్ సెంటర్ అడ్వర్టైజ్ కటౌట్‌గా వాడుకోవచ్చా అని సరదాగా కామెంట్ చేశాడు. వెంటనే సమంత 'బేబీ ఆన్‌స్టెరాయిడ్స్' అని రిప్లై ఇచ్చారు. ఓ బేబీ సినిమాలో సమంతతో పాటు నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story