చాక్లెట్లు తిన్నంత ఈజీగా తేళ్లు తింటున్నారు..

చాక్లెట్లు తిన్నంత ఈజీగా తేళ్లు తింటున్నారు..

సాధారణంగా తేళ్లు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు. సెకను కూడా లేట్ చేయకుండా వీలైనంత దూరం జరుగుతారు. కొందరు డేరింగ్‌ ఫెలోస్‌ వాటిని నలిపి చంపేస్తారు. కానీ మూకప్ప మాత్రం చాక్లెట్లు తిన్నంత ఈజీగా తినేస్తాడు.

ఇంతకీ ఈ మూకప్ప ఎవరంటే కర్నూలు జిల్లా హోళగోంద మండలం మదిలింగహళ్లి గ్రామస్థుడు. తేళ్లను తినడం మూకప్ప హాబీ. తేళ్లు ఎక్కడ దొరుకుతాయా అని బండరాళ్ల కింద వెతుకుతూ ఉంటాడు. అలా తేలు కనిపించడానే .. ఇలా లొట్టలేసుకుంటూ స్వాహా చేస్తాడు. తేలు కుడితే నొప్పి మామూలుగా ఉండదు. అలాంటి విషకీటకాలను తినేస్తున్న మూకప్ప మాత్రం హెల్దీగా ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు

Tags

Next Story