4 July 2019 10:29 AM GMT

Home
 / 
క్రీడలు / అభిమాని వికృత...

అభిమాని వికృత చేష్టలు.. బ్యాట్స్‌మెన్‌ ఎదుట నగ్నంగా..

అభిమాని వికృత చేష్టలు.. బ్యాట్స్‌మెన్‌ ఎదుట నగ్నంగా..
X

బుధవారం ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ అభిమాని బట్టల్లేకుండా మైదానంలోకి పరుగులు తీశాడు. కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సెక్యురిటీ సిబ్బంది కళ్లుగప్పి గ్రౌండ్‌లోకి ప్రవేశించిన ఆ అభిమాని నగ్నంగా తిరుగుతూ ఆటకు అంతరాయం కలిగించాడు. న్యూజిలాండ్‌ బాట్‌మెన్స్ టామ్‌ లాథమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ క్రీజులో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.దీంతో వెంటనే తెరుకున్న భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకుని శరీరంపై బట్టలతో కవర్ చేసి బయటకు లాక్కెళ్లారు. అప్పటికీ ఆ జట్టు స్కోర్ 145/6 గా ఉంది.

ఈ ఘటనపై తీవ్రంగా విమర్శలు వెలువెత్తున్నాయి. సేక్యురిటీ సిబ్బంది అలక్ష్యంపై అభిమానులు ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు నిర్ధేశించిన 306 పరుగుల టార్గెట్‌తో ఛేదనలోకి దిగిన కివీస్‌ జట్టు.. బౌలర్ల దాటికీ నిలవలేక త్వరత్వరగానే వికెట్లను కోల్పోయింది. చివరకు 119 పరుగుల తేడాతో కివీస్ ఓటమిపాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ జట్టు వరల్డ్‌కప్‌ సెమీస్‌లొకి అడుగు పెట్టింది. 1992 ప్రపంచకప్‌లో ఆ జట్టు సెమీస్‌ చేరగా ఆ తర్వాత జరిగిన వరల్డ్ కప్‌లలో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. కివీస్‌ మూడు పరాజయాలతో సాయింట్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. రన్ రేట్ కారణంగా జట్టు సెమీస్‌ చేరడం లాంఛనమే..!

Next Story