ఇతని పాట వింటే జేసుదాసుగారు కూడా ఆశ్చర్యపోతారేమో..

ఒక గొంతు కోట్లాది భారతీయులను దశాబ్దాలుగా అలరిస్తోంది. దేవాలయాలలో ఎందరో దేవీ దేవతలను ఉదయాన్నే నిద్రలేపుతుంది. అటువంటి జేసుదాసు గొంతులో జీవం పోసుకున్న ఎన్నో మధుర గీతాలలో అయ్యప్ప స్వామి 'హరివారసనం స్వామి విశ్వమోహణం' పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇప్పటి కుర్రాళ్లకు సైతం ఈ పాటంటే ఎంతో ఇష్టం. ఆయన గొంతు వింటేనే ఏదో తీయ్యని అనుభూతి కలుగుతుంది. అటువంటి గొంతు మనకూ ఉంటే బావుండనిపిస్తుంది..
అలాంటిది అచ్చంగా జేసుదాసు గొంతును పోలిన వ్యక్తి టీవిలో ప్రత్యక్షమయ్యాడు. తమిళనాడుకు చెందిన ప్రదీష్ ఓ ఛానల్ లో ప్రసారమయ్యే షో లో పాల్గొన్నాడు. అందులో తన గానమాధుర్యాన్ని బయటపెట్టాడు. తనకు ఎంతో ఇష్టమైన జేసుదాసు పాడిన 'హరివారసనం స్వామి విశ్వమోహణం' పాటను అచ్చం జేసుదాసు లాగే పాడి వినిపించాడు. దీంతో అతని పాటకు ముగ్ధులైన ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి చప్పట్లు కొట్టారు. అతని పాట విన్నాక మట్టిలో మాణిక్యాలంటే ఇలాగే ఉంటారేమో అన్న అనుభూతి కలగకమానదు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com