అంబటి రాయుడు నిర్ణయంపై స్పందించిన విరాట్ కోహ్లీ

అంబటి రాయుడు నిర్ణయంపై స్పందించిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్‌బై చెప్పడంపై పెద్ద సంఖ్యలో క్రికెటర్లు స్పందిస్తున్నారు. కొంతమంది బోర్డు వైఖరిపై మండిపడుతుంటే.. మరికొందరు అంబటి భవిష్యత్తు బాగుండాలని విషెస్‌ చెబుతున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ట్విట్టర్‌లో రాయుడుకు శుభాకాంక్షలు తెలిపాడు. రాయుడు నువ్వు చాలా ఉన్నతమైన వ్యక్తివి... రాబోయే కాలంలో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని విరాట్‌ ట్వీట్‌ చేశాడు. అటు గంభీర్‌ మాత్రం బోర్డు వైఖరిపై మండిపడ్డాడు. బోర్డు రాజకీయాలకు రాయుడు బలయ్యాడని మండిపడ్డాడు. సెలెక్షన్‌ కమిటీలో ఉన్న ఐదుగురు కలిసి... రాయుడు చేసినన్ని పరుగులు చేయలేదంటూ ఎద్దేవా చేశాడు. మరోవైపు... కెరీర్‌లో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story