టీడీపీ చేసిన దోపిడిని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతాం : మంత్రి బొత్స
By - TV5 Telugu |5 July 2019 12:23 PM GMT
గత ప్రభుత్వ హయంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు మంత్రి బొత్స. టీడీపీ చేసిన దోపిడిని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతామన్నారు. చదరపు అడుగు 11వందల రూపాయలైతే.. 2వేల 3వందలుగా మార్చి దోచుకున్నారన్నారు మంత్రి బొత్స. కొత్త టెక్నాలజీ పేరుతో అధిక ధరలకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారాయన. తమ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన పేదవాళ్లకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు బొత్స.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com