నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం: నిర్మలా సీతారామన్

By - TV5 Telugu |5 July 2019 5:51 AM GMT
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. అంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బడ్జెట్- 2019కి ఆమోదించింది. ఈ బడ్జెట్‌లో ఆహార భద్రతకు పెద్ద పీట వేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఆహార భద్రతకు రెట్టింపు నిధులను కేటాయించారు. నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆమె తెలిపారు. 10 లక్ష్యాలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. వచ్చే దశాబ్ధకాలానికి ఈ లక్ష్యాలను అందుకుంటారు. పారిశ్రామి విధానాన్ని ప్రోత్సహించేలా ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com