కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెదవి విరిచారు. బడ్జెట్ ఏపీ ప్రజలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రంగాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రైతులు, మహిళలు, యువతరం ఆశలను నెరవేర్చలేదని.. అలాగే సామాన్య, మధ్య తరగతి ప్రజల పొదుపు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌లో అంశాలు లేవన్నారు. గ్రోత్‌ స్టెబిలైనజర్స్‌గా పేర్కొనే ఆటోమొబైల్‌ రంగం, వ్యవసాయ రంగం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సేవారంగాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యంగా ఏపీ ప్రజలను బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందని.. ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని చంద్రబాబు ఆరోపించారు..

మరోవైపు డిజిటల్‌ చెల్లింపులపై టాక్స్‌ ఎత్తివేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. గతంలో దీనిపై వేసిన కమిటీకి చైర్మన్‌గా ఉన్నప్పుడు తాము ఇచ్చిన సిఫార్సుల్లో ఇదే కీలక అంశమని వెల్లడించారు. దీనివల్ల బ్యాంకు లావాదేవీల్లో పారదర్శకత ఉంటుందని.. డిజిటల్‌ చెల్లింపుల్లో వృద్ధి ఉంటుందని చంద్రబాబు అన్నారు.

Tags

Next Story