రూ.76ల బిర్యానీ ఆర్డర్ ఇచ్చి రూ.40వేలు పోగొట్టుకుంది..
రోజూ తినే ఫుడ్ బోరు కొట్టేసింది చెన్నైకి చెందిన ప్రియా అగర్వాల్‌కి. హైద్రాబాద్ బిర్యానీ తినాలనిపించింది. అందుకే ఉబర్ ఈట్స్ కంపెనీకి ఫోన్ చేసి పార్సిల్ తెమ్మంటూ ఆర్డర్ పెట్టింది. బిర్యానీ ధర రూ.76లను ఆన్‌లైన్ ద్వారా చెల్లించింది. మళ్లీ అంతలోనే ఏదో పని పడి అర్జంటుగా బయటకు వెళ్లాల్సి వచ్చింది ఆమెకు. దీంతో ఆర్డర్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఉబర్ ఈట్స్ కాల్ సెంటర్‌కి ఫోన్ చేయగా.. మీరు చెల్లించిన రూ.76 తిరిగి పొందాలంటే ముందు రూ5వేలు కట్టండి. మొత్తం కలిపి మీ అకౌంట్‌లో జమ చేస్తామని చెప్పారు. దాంతో ప్రియ వారు చెప్పినట్టే చేసింది. రూ.76ల కోసం 5 వేలు కట్టింది. మొత్తం పంపిస్తానన్నాడు.. సరి కదా.. ఇప్పుడు ఆ రూ.5,076లు రావాలంటే మరో 5వేలు కట్టమన్నాడు.. అలా మొత్తం రూ.40 వేలు కట్టించుకున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ప్రియా అగర్వాల్ చెన్నై వడపళని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com