ఆంధ్రప్రదేశ్

ఒక ఆడబిడ్డపై ఇంత అనాగరికంగా వ్యవహరిస్తారా : చంద్రబాబు

ఒక ఆడబిడ్డపై ఇంత అనాగరికంగా వ్యవహరిస్తారా : చంద్రబాబు
X

సీఎం జగన్‌ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చీకటి రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్త పద్మ మృతికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇంట్లో ఉన్న మహిళను రోడ్డు పైకి ఈడ్చుకుని వచ్చి అతి దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆడబిడ్డపై ఇంత అనాగరికంగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. ఆమెను వివస్త్రను చేసి ఫోన్‌లో చిత్రీకరణ చేయడం దారుణం కాదా అని చంద్రబాబు మండిపడ్డారు.

అందరూ చూస్తుండగానే ఇంత దారుణం జరిగినా ముఖ్యమంత్రి స్పందించరా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మరో పులివెందుల చేయాలని చూస్త ఊరుకొనేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. అంతకుముందు ప్రకాశం జిల్లా రుద్రమాంభాపురంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త పద్మావతి కుటుంబాన్ని మాజీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. పద్మావతి చిత్రపటానికి నివాళులర్పించిన చంద్రబాబును చూడగానే.. ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని అక్కున చేర్చుకుని ఓదార్చిన చంద్రబాబు.. కుటుంబానికి అన్నివిధలా టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Next Story

RELATED STORIES