గ్రామ కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తాం - సీఎం జగన్

ఆర్ధిక శాఖపై రివ్యూ చేశారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. 2019-20 బడ్జెట్‌లో ఉండాల్సిన ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 11 వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 12 వ తేదీన సీఎం జగన్‌. నేతృత్వంలో ప్రభుత్వం.. తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మొత్తం 15 పనిదినాల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్‌లో నవరత్నాల అమలుకే పెద్ద పీటే వేయనున్నారు. ఇప్పటికే నవరత్నాల్లోని 60 శాతంపై గా అంశాలపై రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన నవరత్నాల్లోని అంశాలన్నింటికి బడ్జెట్‌లో తగిన కేటాయింపు చేస్తామన్నారు.

మరోవైపు ఏపీలో కొత్త ఇసుక విధానంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు..ప్రస్తుత విధానంలో పలు కీలక మార్పులు సూచించారు. ఇసుకను ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఇసుక స్టాక్‌యార్డుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా.. బయటకు వెళ్లేటప్పుడు కూడా వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు చేపట్టాలన్నారు. ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి ఉండాలని ఆదేశించారు సీఎం. మాఫియా, క్రమాలు, అవకతవకలు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అక్రమ తవ్వకాలు, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2 నెలల్లోగా అదనపు రీచ్‌లను గుర్తించి...డిమాండ్‌కు తగినట్టుగా ఇసుకను అందించనుంది ఏపీ ఎండీసీసీఎం. మరోవైపు... ప్రతి 2వేల మందికి గ్రామసచివాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గ్రామ సచివాలయాల్లో ఖాళీల భర్తీకి జులై 15నాటికి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం. అటు 2019-20 బడ్జెట్‌లో ఉండాల్సిన ప్రతిపాదనలపైనా సీఎం సమీక్షించారు.

Tags

Next Story