అలకబూనిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే..

అలకబూనిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే..
X

గద్వాల టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే క్రిష్ణ మోహన్‌‌ రెడ్డి అలకబూనారు. తనకు కేటాయించిన గన్‌మెన్‌ను వెనక్కు పంపారు. వ్యక్తిగత కారణాలంటూ సాకుగా చూపుతున్నా... మంత్రి నిరంజన్‌ రెడ్డితో ఉన్న విభేదాలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల జడ్పీ సీఈవో నియామకం విషయంలో ఈ విబేధాలు ముదిరి పాకాన పడ్డట్లు తెలుస్తోంది. దీనికి తోడు డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు విషయంలోనూ... ప్రభుత్వం స్పందన చూపడం లేదని ఎమ్మెల్యే బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలోనే క్రిష్ణమోహన్‌ రెడ్డి... గన్‌మెన్‌లను సరెండర్‌ చేశారని తెలుస్తోంది.

Tags

Next Story