ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

నెల్లూరులోని పడారుపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నాగులు అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్ లీకవుతుండటంతో.. అనిల్ అనే బాయ్ వచ్చి రిపేర్ చేస్తున్నాడు. ఇంతలోనే సడెన్ గా మంటలు వచ్చి పేలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న ఈశ్మరమ్మ, పార్వతి, జ్యోతి అనే మహిళలతోపాటు రిపేర్ చేస్తున్న అనిల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు ఇంట్లోని వస్తులు కూడా ధ్వంసమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story