హైకోర్టు సంచలన తీర్పు.. సిద్దిపేట ఆర్డీవోకు జైలు శిక్ష

హైకోర్టు  సంచలన తీర్పు.. సిద్దిపేట ఆర్డీవోకు జైలు శిక్ష

మల్లన్న సాగర్‌ భూముల వ్యవహారంలో... తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తప్పుడు సమాచారం ఇచ్చిన ముగ్గురు అధికారులకు జైలు శిక్ష విధించింది. తొగుట తహసీల్దార్‌ వీర్‌సింగ్‌, సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, సూపరింటెండెంట్‌ వేణుకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో పాటు ఒక్కొక్కరి రెండు వేల రూపాయల జరిమానా విధించింది హైకోర్టు.

కోర్టు ధిక్కరణ తీర్పును ఉల్లంఘించి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పనులు చేపట్టినట్లు వీరిపై అభియోగం. మల్లన్నసాగర్‌లో ముంపునకు గురైన తొగుట గ్రామ రైతు కూలీలు.... ఆర్అండ్‌ఆర్ ప్యాకేజీతోపాటు పునరావాసం, పునరుపాధి కల్పించకుండా అధికారులు పనులు చేయిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.... ఈ భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

అయినా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి పనులు చేపట్టారు అధికారులు. దీంతో రైతు కూలీలు హైకోర్టులో.... కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ ఇవేవి పట్టించుకోని అధికారులు పనులు చేయిస్తున్నారు. దీంతో రెండో సారి కోర్టు ధిక్కరణ కేసు వేశారు రైతుకూలీలు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ....... కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన ఈ ముగ్గురు అధికారులకు...3 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది హైకోర్టు.

Tags

Read MoreRead Less
Next Story