ప్రియురాలి అన్నను చంపేసిన ప్రేమికుడు

ప్రియురాలి అన్నను చంపేసిన ప్రేమికుడు

తన చెల్లెలిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ఓ అన్నయ్య.. ఆ ప్రేమికుడికి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. ఈనేపథ్యంలో కక్ష పెంచుకున్న ఆ ప్రేమికుడు తన ప్రియురాలి అన్నను కత్తితో పీక కోసి హత్య చేశాడు. ఈ దుర్ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగింది.

పాల్వంచ తెలంగాణ నగర్‌లో నావాసముంటున్న షకీల్‌.. తన చెల్లెల్ని శివశంకరరెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలుసుకుని తన స్నేహితులతో కలసి అతనికి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో.. షకీల్‌పై కక్ష పెంచుకున్న శివశంకరరెడ్డి అదను చూసుకుని షకీల్‌ను హత్య చేశాడు. కత్తితో మెడనరికి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story