పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు..!
వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో ప్రవేశించాలంటే అద్భుతమే చేయాల్సిన మ్యాచ్‌లో... పాకిస్తాన్ సాధారణ ప్రదర్శనే చేస్తోంది. బంగ్లాదేశ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో... టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ 8 వ ఓవర్లో ఆ జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ షఫీయుద్దీన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుమున్న రన్‌రేట్‌తో చూస్తే.. పాకిస్తాన్ 320 పరుగుల స్కోర్ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ చివరి ఓవర్లో బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడినా.. స్కోరు 350 దాటదు. ఈ లెక్కన పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే.. బంగ్లాదేశ్‌ను 35 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో అద్భుతమే అవుతుంది. పైగా పటిష్టంగా ఉన్న బంగ్లా జట్టును ఇంత తక్కువ స్కోరుకు నిలువరించడం ఒక్క పాకిస్తాన్‌కే కాదు.. ఏ జట్టుకైనా అసాధ్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు దూరమైనట్లే భావించవచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com