అవి రాకముందే పోలవరం కాపర్‌ డ్యాం పనులు పూర్తి చేయాలి : పీపీఏ

అవి రాకముందే పోలవరం కాపర్‌ డ్యాం పనులు పూర్తి చేయాలి : పీపీఏ

పోలవరంలో పర్యటించింది పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ బృందం. ఎగువ ప్రాంతంలో కురిసే భారీ వర్షాలు, వరద రాకపోముందే కాపర్‌ డ్యాం పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించింది పీపీఏ. ఇందుకోసం పనులు ఎలా పూర్తి చేయాలో ఇరిగేషన్‌ అధికారులకు సూచించామన్నారు పీపీఏ సీఈవో రాజేంద్ర కుమార్‌ జైన్. స్పిల్‌వే, కాపర్‌ డ్యాం పనులను పీపీఎ బృందం క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. స్పిల్‌వే ప్రాంతంలో 48 బ్లాక్‌లను చూశారు అధికారులు.

గోదావరిలో ఈ సారి 15 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వరదనీరు వస్తే... కాపర్‌ డ్యాం ఎంతవరకు నిలబడుతుందని పీపీఏ టీం...... అధికారులను అడిగి తెలుసుకుంది. ఈ కాఫర్‌ డ్యాం వల్ల ఏజెన్సీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు ఉండదన్నారు అధికారులు. వరద పెరిగితే.. ముంపు గ్రామాల పరిస్థితిపై అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇక రీటెండరింగ్‌ విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందన్నారు పీపీఏ సీఈవో ఆర్కే జైన్‌. ప్రాజెక్ట్‌లో డ్యాం , కాలువలు, పైప్‌లైన్‌ పనులు జరగాల్సి ఉందన్నారు. పనులు వేగవంతం చేసిన సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్ట్‌ పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌లో పరిస్థితులన్నీ తమ కంట్రోల్‌లోనే ఉన్నాయన్నారు.

Tags

Next Story