అవును.. మేమిద్దరం ప్రేమించుకున్నాం..

కలిసి తిరిగాం.. కలిసి చదువుకున్నాం.. ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకున్నాం. ఇద్దరం పెళ్లిళ్లు చేసుకుని విడిపోతే.. ఆ చేసుకునే వాడు మంచి వాడుకాకపోతే.. అమ్మో ఊహించడానికే భయంగా ఉంది. అందుకే మేమిద్దరం ఒక్కటైతే అన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా పెద్దవాళ్లని కలిసి పెళ్లి చేయమని అడిగాం. దానికి ఇదేం పిచ్చి ఎవరైనా వింటే నవ్విపోతారు అని వార్నింగ్ ఇచ్చారు. ఇంట్లోనే కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అందుకే పారిపోయి పెళ్లి చేసుకుంటున్నాం అంటున్నారు కాన్పూర్‌కి చెందిన ఈ ఇద్దరు యువతులు. ఇరువురి కుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోవడంతో కాన్పూర్ నుంచి వారణాసి రైలెక్కేశారు. అక్కడి నుంచి విర్భన్‌పూర్లోని రొహానియా ప్రాంతానికి చేరుకుని అక్కడి ఆంజనేయస్వామి ఆలయ పూజారిని తమకు వివాహం జరిపించమని అడిగారు. బంధువులు ఎవరూ లేరు. స్థానిక గ్రామస్తులే పెళ్లి పెద్దలుగా నిలవడంతో ఆలయ పూజారి ఇద్దరమ్మాయిలకు పెళ్లి చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com