అమ్మ, అమ్మమ్మ అందరూ కలిసి హ్యాపీగా చూసే చిత్రం .. ఓ బేబీ ట్విట్టర్ రివ్యూ

అమ్మ, అమ్మమ్మ అందరూ కలిసి హ్యాపీగా చూసే చిత్రం .. ఓ బేబీ ట్విట్టర్ రివ్యూ

కొరియాలో హిట్టయిన 'మిస్ గ్రానీ' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింది నందినీ రెడ్డి. ఓ బేబీగా సమంత ఎమోషనల్‌ని, కామెడీని పండించి ఆధ్యంతం ఆకట్టుకుంది. మంచి కథాంశం ఉన్న చిత్రాలని ఎంపిక చేసుకుని మంచి మార్కులు కొట్టేస్తోంది సమంత. ఇప్పుడు ఓ బేబీ అంటూ సందడి చేస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నాగశౌర్య, లక్ష్మీ, రావురమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో సమంత 23 ఏళ్ల యువతిగా 70 ఏళ్ల బామ్మగా డిఫరెంట్ రోల్ ప్లే చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది సమంత. దాంతో అభిమానులంతా ఓ బేబీ కోసం ఎదురు చూశారు. చిత్రాన్ని చూసిన నెటిజన్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. సమంత తన కెరియర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని..

క్లైమాక్స్‌సీన్స్‌లో అద్భుతంగా నటించిందని అంటున్నారు. కొంతమంది అమ్మమ్మలతో కలిసి వెళ్లి చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారట. ఎంటర్‌టైన్ చేస్తూనే ఎమోషనల్‌ డ్రామాగా కథను మలిచిన తీరు అద్భుతంగా ఉందని అంటున్నారు ప్రేక్షకులు. సమంత కామెడీతో కడుపుబ్బా నవ్వించిందని అంటున్నారు నెటిజన్లు. మరికొన్ని ట్విట్టర్ రివ్యూలు..

Tags

Read MoreRead Less
Next Story